Monday, May 2, 2016

ఆహార పదార్ధాలలో కల్తీలు

ఆహార పదార్ధాలలో కల్తీలు
జీవించడానికి ఆహారం ఎంతో అవసరం, కానీ చాల ఆహార పదార్దాల్లో కల్తీ జరుగుతున్నది. కల్తీ ఆహారపదార్ధాల వల్ల అనేక రోగాలు వస్తాయి కాదు వస్తున్నాయి ; ఇవి దీర్ఘ కాలిక  లేదా స్వల్ప కాలికం గా ఉంటాయి;   వొక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చును. తెలుగు లో ఈ విషయాలను వివరించడానికి చేస్తున్న చిన్ని ప్రయత్నం. 


ఆహారకల్తీ రకాలు     

1. ఆహారపదార్దాల్లో కలిపే పదార్దాల వల్ల ఆరోగ్యానికి హాని జరగడం . 2. తక్కువ విలువ కలిగిన వాటిని కలపడం . 3. చెడిపోయిన పదార్దాలకు రంగు , మసాలాలను చేర్చి అమ్మడం.
సాధారణంగా ఆహార పదార్దాలు కల్తీ అవుతుంటాయి .
వర్తకులు మట్టి, నీరు, తినే నూనె లలో పెట్రోలియం సంబంధిత నూనె లను , పొట్టు , చెత్త ,సుద్ద, హానికారక రంగులు , చెడిన వాటిని కలుపుతుంటారు .
కొన్నిసార్లు పొరపాటున క్రిమిసంహారకమందులు, చనిపోయిన కీటకాలు, ఎలుక వెంట్రుకలు , విసర్జకాలు కలుస్తుంటాయి.
1. పాలల్లో --- నీరు,  పిండి , యూరియా, సోపు , నూనె , ఫార్మలిన్  వంటివి కలుపుతారు
కృత్రిమ పాలు - ఇవి చేదుగా వుండి  సబ్బు తాకినట్లు వుండి , కాచినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. మందుల దుకాణాల్లో దొరికే  యూరి యేస్ పట్టీలను తెచ్చి  పరీక్షించితే రంగు మారుతుంది.
పశువులకు ఆక్సిటోసిన్ అనే ఇంజక్షను ఇఛ్చి పాలు పితుకుతుంటారు. ఆ పాలను తాగడం వల్లనే రొమ్ము కాన్సరు, స్త్రీలలో హార్మోనుల తేడాలు కనిపించి జబ్బులు వస్తున్నాయి.
పాత పాల పాకెట్లు చించి ఆపాలకు సోడాఉప్పు కలిపి టీ కోట్లల్లో , విడిగా అమ్ముతున్నారు.
రెఫ్రిజిరేటర్ లో ఉంచినా ఆ పాలల్లో బ్యాక్తీరియా పెరుగుతుంది.

2. పెరుగు , కోవా లలో పిండి , తక్కువ రకపు కొవ్వు కలుపుతారు
ఈ కల్తీ లను కనుక్కోవడానికి కొంచెం HCl, iodine, sulphuric acid వంటి రసాయనాలు అవసరమవుతాయి . ప్రస్తుతం ఆమ్లాలు కొద్ది పరిమాణాల్లో స్వేచ్చగా దొరకడం కష్టము . అందుకే ఇంటి దగ్గర పరీక్షించు కోవడం కష్టం . లాబ్ ల సహాయం అవసరం
పాలు విరిగి పోకుండా ఉండేదుకు కొందరు ఘాడ salfuric( గంధకామ్లం ) ఆమ్లము కలుపుతున్నారు; అలాగే ఫార్మాలిన్  కూడా కలుపుతున్నారు; వీటిని కనుక్కోవడం చాలా కష్టం
3.సాధారణంగా మనం చూసే దాల్చిన చెక్క నిజమైనది కాదు.
చైనా సిన్నమోమ్ / చైనా దాల్చిన చెక్క ఘాటైన వాసన కలిగి , ముదురు రంగు లో వుండి, గరుకు  గా ఉంటుంది;  తింటె కాలేయం చెడిపోతుంది, లేదా కాన్సర్ రావచ్చుఁ 
4. పచ్చి బఠాణి , కంది పప్పు, పసుపు మొదలైన వాటికి మెటాలిక్ రంగులు కలుపు తుంటారు అపుడు అవి ముదురు రంగులో ఆకర్షణీయం గా ఉంటాయి, వాటిని తింటె కాన్సర్ వస్తుంది.  కల్తీ మిరప పొడి : మిరప కాయల నుండి  నూనె / ఇతర  పదార్థాలను తీసి వేసిన తరువాత ఆ చెత్త కు విషపూరిత రంగులను కలిపి అమ్ముతున్నట్లు రుజువైనందున  కారం ఇంటి వద్దనే తయారు చేసుకొని వాడడం ఉత్తమం. ఈ కారం కాన్సరు కారకం.  ! 
5. నూనె లలో విషపూరిత రసాయనాలు, జంతు కొవ్వులు, ఆముదము, పిచ్చి కుసుమ నూనె కలుపుతుంటారు. 
నేతి లో చనిపోయిన జంతువుల ఎముకల నుండి తీసిన కొవ్వు , వనస్పతి , రంగు , యూరియా వంటి వన్నీ కలుపుతున్నారు   
కంది పప్పు లో కేసరి పప్పు  కలుపు తారు,

ఎండు కొబ్బరి తెల్లగా లేకున్నా , ముక్కిన వేరుశనగ విత్తనాలు తిన్నా వాటిలో అప్లాటాక్సీన్  అనే విష పదార్ధముంటుంది ; తింటె కాలేయం చెడి పోతుంది , కాన్సరు కూడా రావచ్ఛు.
బూజు, శిలీన్ద్రాలు పట్టిన ఆహార పదార్ధాల వలననే కాన్సరు వస్తుంది. 
తెనే : సాధారణంగా తేనె లో బెల్లం పాకం, చక్కెర పాకం  నీరు కలుపుతుంటారు .
కోవా , వెన్న , పనీర్  వంటి వానిలో మైదా పిండి కలుపుతున్నారు.. ఐస్ క్రీములు, శీతల పానీయాల్లో కార్న్ సిరప్ , మెటాలిక్ పసుపు రంగు కలుపుతున్నారు. 
బియ్యం , గోధుమలు,పప్పులలో చెత్త, చిన్న రాళ్లు, ఇసుక, కలుపు విత్తనాలు కొద్దిగా ఎక్కువగా కలుపుతున్నారు . తక్కువ రకపు మినప పప్పును పాలిష్ చేయడానికి పాల రాళ్లను పాలిష్ చేయడానికి వాడే పిండి వాడుతున్నారు.  
గోధుమ పిండి లో మైదా, బోరిక్ ఆసిడ్  , శనగ పిండిలో తక్కువ రకపు బియ్యపు పిండి  కలుపుతున్నారు.  
రంగులు : ఆహార పదార్ధాల్లో వాడే రంగులు నాన్యమయినవి ఉండాలి. కానీ చాలామంది కాన్సరు కారక మైన రసాయనాలను కలుపు తున్నారు.  కాబట్టి రంగులు కలిపినవి తిన వద్దు. 
పసుపు లో మెటాలిక్ రంగు  లేక lead  chromate కలుపుతారు. 
నల్ల మిరియాలలో ఎండ బెట్టిన బొప్పాయి విత్తనాలను  కలుపుతున్నారు.  వీటిని నీళ్లలో వేస్తే బొప్పాయి విత్తనాలు  పైకి తేల్తాయి. 
లవంగాలు , ఏలకులు  వాటిలో నూనె తీసిన వాటిని కలుపుతారు . నూనె తీసినవి తక్కువ వాసనతో , చిన్నగా ముడుతలతో ఉంటాయి . 
మిరప పొడి లో ఇటుక పొడి, రంగు కలిపిన చెక్క పొడి కలుపుతున్నారు . మిరప కాయల్లో బూజు వున్నా వాటికి రంగు కలిపి ఎర్రగా చేస్తారు; 
బూజు పట్టినవి  లేదా ముక్కినవి తింటె  కాలేయపు జబ్బులు ,కాన్సరు  వస్తాయి ;
 పశువులకు , కోళ్లకు  దాణాగా వాడినా కూడా అవి మనకే చివరకు హాని కలిగిస్తాయి ;  
ఇంగువ లో గోధుమ పిండి , బంక కలుపుతారు . స్వచ్చమైన ఇంగువ కర్పూరం లాగా వాసనతో మండిపోతుంది . కల్తీది పూర్తిగా మండదు . అయోడైజ్డ్ ఉప్పులో మాములు ఉప్పు కలిపేస్తున్నారు . టీ లో వాడేసిన టీ పొడికి బూట్ల పాలిష్ రంగు కలిపి, అమ్ముతున్నారు 
మిఠాయి లపై పెట్టె వెండి రేకులకు బదులు అల్యూమినియం రేకులు ఉంచుతున్నారు
బండ్ల మీద , చిన్న దుకాణాల్లో అనేక సార్లు  కాచిన మురికి నూనె ను వాడ్తున్నారు . చిక్కటి ఈ నూనె లో కాన్సరు కారక రసాయనాలుంటాయి . పచ్చి బఠాణి లను  నీళ్లలో వేస్తే నీళ్లు ఆకుపచ్చ రంగు లో వుంటే హానికర రంగు కలిపినట్లే . బఠాణి కాయలను వలిచి విత్తనాలను నీళ్లలో వేస్తే రంగు రావు. కొన్ని చోట్ల ఆకు కూరలకు కూడా రంగు కలుపుతున్నారు. కొన్నిసార్లు ఆకు కూరలు , వంకాయలు చిరు చేదు గా ఉంటాయి , దీనికి కారణం మిగిలిన హానికర పురుగుమందులు , పురుగు మందులను చల్లిన తరువాత కనీసం 10 రోజుల వరకు కోయ రాదు; ఆశ  తొ  లేక తెలియక చేసిన తప్పుకు తిన్న వాళ్ళు  రోగాల బారిన పడ్తున్నారు; 

అల్లం వెల్లుల్లి పేస్ట్  లో కొంచెం అరటి దూట , గెల కాడ ముక్కల ను రుబ్బి కలుపుతున్నారు.  
హోటళ్లలో కల్తీలు :  ఇడ్లి , దోశె , సాంబారు , కూరల పైన తయారీ సమయం , తయారీకి వాడిన పదార్థాలు వ్రాసి వుండవు,  కాబట్టి నమ్మకంగా కల్తీ చేస్తున్నారు ; వండేందుకు వాడే పదార్ధాలు  నాణ్యమయినవి వాడక ముక్కిన, లేదా  కుళ్ళిన కూరలను కలిపి వేయడం, నకిలీలు వాడడం చేస్తే  కొందరు ముందురోజు మిగిలిన పదార్థాలకు కొంచెం మసాలా జోడించి మరోసారి వేడిచేసి అపుడే తయారు చేసిన వాటితో కలిపేస్తుంటారు . ఇవి తిం టే  విరోచనాలు జ్వరం వస్తుంటాయి .
ఇక దోశె ఇడ్లి వంటివి తయారు చేయడానికి వాడే పిండి లో బియ్యపు గంజి , మైదా పిండి, మిగిలిన అన్నం కలిపి వాడుతుంటారు . వాటిని మడ్డి నూనె తో కాల్చితే , అవి తిన్న వాళ్ళ కు జీర్ణ కోశ వ్యాధులు , కాన్సరు రావడం ఖాయం. 
కెచప్ లు , సాస్ లు  , నిల్వ పచ్చళ్ళు ఇపుడు విరివిగా వాడుతున్నారు . లోకల్ గా తయారయ్యేవి చాలా వరకు నాసి రకం పదార్థాలతో తయారవు తున్నాయి.  పరిశుభ్రత విషయం లోను బాగా లేవు. విష పూరిత రంగులు, చైనా కారం , నిమ్మ రసానికి బదులు  సిట్రిక్ ఆమ్లము , అసిటిక్ ఆమ్లము, తీపి కొరకు నాసి రకం సిరప్  లు  కలుపుతున్నారు . ఇవి తింటే మీ కడుపు లో పుండ్లు రావడం ఖాయం.  
నేతి మిఠాయి ల తయారీకి  నెయ్యి తో బాటు డాల్డా , నూనె వాడడం, 
వండడానికి వాడే మంచి నీరు శుభ్రంగా లేక పోయినా వ్యాధులు వస్తాయి;
కోకో కోలా, Pepsi, Coca Cola, Mountain Dew, Sprite and 7Up లను పరిశీలించినపుడు 5 రకాల విష పదార్ధాలు ఉన్నట్లు తెలిసింది, అవి antimony, lead, chromium and cadmium and the compound DEHP or Di(2-ethylhexyl) phthalate; ప్లాస్టిక్ సీసాలను  polyethylene terephthalate(PET) తో తయారు చేస్తారు, వాటిలోనుంచి ఈ విషయాలు వేడికి కరిగి వస్తాయి. వేడి 30 డిగ్రీ ల సెంటిగ్రేడు దాటితే ఈ ప్రక్రియ జరుగు తుంది. 
అలాగే గీతలు , గాట్లు  పడిన నాన్ -స్టిక్  పాత్రలను వంటలకు వాడినా అవి కూడా విష పూరిత మైతాయి 
  
చిన్న బడ్డీ  హోటళ్ల ల్లోనే కాదు ఈ కల్తీలు పెద్ద హోటళ్లలో కూడా జరుగు తున్నాయి;  పట్టు పడే వరకే అందరు దొరలే ; 
అవినీతి, తగినంత సిబ్బంది లేక పోవడం, తరచుగా తనిఖీలు జరగక పోవడం, ఫిర్యాదులు చేయడానికి వెనుకాడడం ,   ప్రధాన కారణం;  
హోటళ్లలో అందరికి కనుపించేట్లు ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో వారి చిరునామా ,ఫోన్ నంబర్లు  ఉంచాలి; హోటళ్లలో తగిన వివరాలతో బిల్లు ఇవ్వాలి; వీటిని అమలు చేస్తే కొంచెం చైతన్యం  వస్తుంది.  
చిన్న బడ్డీ కోట్లల్లో అమ్మే చిరు తిండ్లు , బండ్ల మీద అమ్మే బజ్జిలు,  మాంసాహార చిఱుతుళ్ళు తయారీకి వాడే పదార్థాలు చాలా నాసి రకాలు, పరిశుభ్రం గా ఉంటాయి , కాబట్టి పిల్లలకు ఎట్టి పరిస్తితుల్లోనూ వాటిని తినిపించకండి .  
నూనెలు : ఒకసారి కాచి న నూనెను తిరిగి వాడితే కాన్సరు వస్తుంది . కాబట్టి వాటిని వాడ రాదు. నూనెల్లో చాలాసార్లు పెట్రో సంభందిత నూనెలను , జంతు కళేబరాల నుండి తీసిన నూనె ను  కలుపుతున్నారు. 
వేరుశనగ నూనెలో ఆముదం , ముడి పామాయిల్ కలపడం కూడా కల్తీయే ;
మీదృష్టికి ఆహార కల్తీ జరుగు తున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయండి. 
కల్తీ ఆహారం విషంతో సమానం ; కోరి విషం తింటారో లేక చైతన్య వంతులుగా తయారవుతారో  నిర్ణ యించుకోండి. డబ్బులేదని విషం తింటారా ? 
ఒక్క క్షణం నాలుక కోరే రుచి కొరకు శరీరాన్ని రోగాల పాల్చేస్తారా ? ఎవ్వరు కొనక పోతే వ్యాపారులు మారకేంచేస్తారు ? 
హోటళ్ల ఎక్కువయితే  హాస్పిటళ్లు ఎక్కువవుతాయి !         
      ఇంకా ఉంది .... వేచి ఉండండి